ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
రాష్ట్రాభివృద్ధికి బిజెపి భరోసా * ధర్మవరంలో బిజెపిలోకి చేనేతల చేరికలు
Updated on: 2024-05-05 09:46:00

ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు బిజెపి భరోసా కల్పిస్తోందని బిజెపి నేషనల్ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ పేర్కొన్నారు. పట్టణంలోని బిజెపి కార్యాలయంలో శనివారం చేనేత నాయకులు ఎర్రజోడు లోకేష్ , ఎర్రజోడు చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలో పలువులు చేనేతలు బిజెపిలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అరుణ్ సింగ్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల వైసిపి పాలనలో చితికిపోయిన రాష్ట్రాన్ని బిజెపి టిడిపి ,జనసేన పార్టీలతో కలిసి అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ నమ్మకంతోనే ఎంతోమంది బిజెపి మీద విశ్వాసంతో పార్టీలోకి చేరుతున్నారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని చెప్పారు.