ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
కరప్షన్, కలెక్షన్ కు కేర్ ఆఫ్ కేతిరెడ్డి * ప్రజా సమస్యలు గాలికి వదిలి దందాలపైనే ఆయన దృష్టి: సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-05-03 07:36:00

* అధికారంలోకి రాగానే అభివృద్ధి పైనే దృష్టి పెడతా ముదిగుబ్బ : ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కరప్షన్, కలెక్షన్, దందాలు చేస్తూ కాలం గడిపారని ధర్మవరం నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ముదిగుబ్బ మండలంలోని నల్లచెర్లోపల్లి, యాకర్లకుంటపల్లి, నల్లాయకుంటపల్లి, ముక్తాపురం తాండ, ముక్తాపురం, మంగళ మడక, రామస్వామి తండా, పూజారి తండా,పొడరాళ్ళపల్లి, గరుగుతాండా, గుడ్డంపల్లి తండా, సానేవారి పల్లి, మలక వేముల క్రాస్, యనమల వారి పల్లి, మలక వేముల, నాగారెడ్డిపల్లి, మల్లమ్మ కొట్టాల, ఎన్.ఎస్.పి కొట్టాల, గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో గ్రామస్తులు సత్య కుమార్ యాదవ్ కు అడుగడుగున పూలమాలలు, మంగళ హారతులు పడుతూ బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని గ్రామస్తులు చెప్పారు. ఈ సందర్భంగా సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని వైసీపీని గెలిపిస్తే ఈ పాలకులు రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి ప్రజలను కష్టాల పాలు చేశారన్నారు. ప్రచారంలో ఏ గ్రామానికి వెళ్లినా తమకు గుక్కెడు నీల్లిస్తే చాలు ఇంకేం అవసరం లేదు అని ప్రజలు దీనంగా వేడుకుంటుంటే తన మనస్సు తరుక్కుపోతోందన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రజలకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయాడంటే అతడి పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే పరిపాలన చేయకుండా ఈ ఐదేళ్లు గాడిదలు కాసారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో కేతిరెడ్డి కబ్జా చేయని ప్రాంతం లేదు, దందా చేయని వ్యాపారం లేదని ఆయన ఆరోపించారు. పొడరాల్లపల్లి ప్రాంతంలో జిల్లేడు బండ ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహార చెల్లింపు, పునరావాస కల్పన గురించి గ్రామస్తులు మాట్లాడితే తనకు ఆ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించే విషయమే తెలియదని ఎమ్మెల్యే అహంకారంతో చెప్పారని, ఇలాంటి పాలకులకు ప్రజలు తమ ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామస్తులతో సమావేశం అయ్యి పరిహారం , పురావాసం గురించి ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తులైన సరే అర్హతలు ఉంటే వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందిస్తానని చెప్పారు. రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము ఇచ్చిన మేనిఫెస్టో తప్పకుండా అమలు చేస్తామని, ప్రజా శ్రేయస్సే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా బాధ్యత తాను తీసుకుంటానన్నారు