ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
బిజెపి, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే వృధా ఇందిరమ్మ రాజ్యం తోనే దేశం సుభిక్షం ఎన్నికల ప్రచారంలో అశ్లేష రెడ్డి
Updated on: 2024-04-30 07:17:00
కేశంపేట: ప్రజా సమస్యలను పట్టించుకోని బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తే వృధా అవుతుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశి చందర్ రెడ్డి సతీమణి అశ్లేష రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆమె ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సతీమణి అనురాధ, జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి , కాంగ్రెస్ మైనార్టీ నేత యండి.ఇబ్రహీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి దేశంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందఅన్నారు. రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ ఒకగూటి పక్షులేనని ఆ పార్టీలకు ఓటు వేసి ఓటును వృధా చేసుకోకూడదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి కి ఓటు వేసి ఇందిరమ్మ రాజ్యాన్ని దేశంలో చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే ఐదింటిని అమలు చేసినట్లు రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపల ఆ హామీని నెరవేర్చి రైతు ముఖంలో సంతోషాన్ని చూసే సన్నివేశం త్వరలోనే వస్తుందని అన్నారు. నా భర్త వంశీ చంద్ రెడ్డి కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లును కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, పల్లె ఆనంద్ కుమార్, గిరి యాదవ్, కర్ణకార్ రెడ్డి,భాస్కర్ గౌడ్,తుమ్మల గోపాల్, అనసూయమ్మ, సురేష్ రెడ్డి,శశివర్ధన్ రెడ్డి, రావుల పెంటయ్య, రూప్ల నాయక్, ప్రకాష్ ,కోడూరు రాములు, అమెర్,పర్వతాలు, నర్సింలు,శ్రీకాంత్ రెడ్డి,యారం భాస్కర్ రెడ్డి, లాలమొని చంద్రయ్య, శ్రీధర్ , అఖిల్, సల్మాన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.