ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
జగనన్న మేనిఫెస్టో సూపర్ -2024..జగనన్న వన్స్ మోర్ రాజమండ్రి ఎంపీ భరత్..
Updated on: 2024-04-27 20:44:00
రాజమండ్రి, ఏప్రిల్ 27: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం విడుదల చేసిన మేనిఫెస్టో పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ తెలిపారు.
శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న మేనిఫెస్టో చూశాక టీడీపీ చంద్రబాబుకు కలవరపాటు వచ్చి ఉంటుందన్నారు. టీడీపీ ఆరు పథకాలు (సూపర్ సిక్స్) పక్కన పెట్టేసి ప్రజలను వంచించేందుకు అర కేజీ బంగారం, బెంజి కారు ఇస్తానని మోసపూరిత వాగ్దానాలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఎందుకంటే సీఎం కుర్చీ కోసం ఎన్ని అబద్ధాలు ఆడటానికైనా చంద్రబాబు వెనుకాడడని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. జగనన్న నీతికి నిజాయితీకి మారు పేరని, అన్నాడంటే చేస్తాడన్నారు. గత ఎన్నికలలో ఏవైతే మేనిఫెస్టోలో చేస్తామని జగనన్న చెప్పారో నూరు శాతం చేసి చూపారని అన్నారు. పాత పథకాలను కొనసాగిస్తూ పెన్షన్లను పెంచడం, వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి లక్షన్నరకు పెంచుతామని మేనిఫెస్టోలో జగనన్న చెప్పారన్నారు. అలాగే వైఎస్సార్ కాపు నేస్తం, ఓబీసీ నేస్తం, అమ్మ ఒడి, కల్యాణ మస్తు, షాదీ తోఫా కొనసాగింపు, ఇంకా అర్హులెవరైనా ఉంటే ఇళ్ళ పట్టాలు పంపిణీ కొనసాగింపు, రైతు భరోసా పెంపు, మత్స్యకార భరోసా, వాహన మిత్ర..ఇలా అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ లబ్ధిని పెంచడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. జగన్ అంటే ఒక నమ్మకం అని, చంద్రబాబు అంటే అబద్ధమని అన్నారు. పిల్లనిచ్చిన మామను ఎలా వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నాడో రాష్ట్ర ప్రజలంతా చూశారని, 2014లో ఎన్నో వాగ్దానాలిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక కరివేపాకులా ప్రజలను తీసిపారేశాడని..అందుకే 2019 ఎన్నికలలో సరైన గుణపాఠం చంద్రబాబుకు చెప్పారన్నారు. ఈ ఎన్నికలలో కూడా టీడీపీకి అదే రీతిలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలంతా ముక్త కంఠంతో '2024..వన్స్ మోర్ జగన్..' అంటున్నారని, రాష్ట్రంలో వైసీపీ అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఎంపీ భరత్ ధీమా వ్యక్తం చేశారు.