ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
యువకుడిపై కత్తితో దాడి - మరో యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం- పోలీసు ఔట్ పోస్టు వద్ద ఘటన
Updated on: 2024-04-22 19:17:00

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి చౌరస్తా ఔట్ పోస్టు వద్ద సోమవారం యువకుడు గంజాయి మత్తులో ఒక యువకుడిపై కత్తితో దాడీ చేయగా మరో యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు ఊపిరిపీల్చుకుంటుండగా నగరంలోని అర్సపల్లి చౌరస్తాలోని పోలీసు ఔట్ పోస్టు వద్ద గంజాయి సేవించి కత్తితో దాడికి పాల్పడ్డ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. గాయపడిన యువకుడిని ఫిరోజ్ ఖాన్ గా గుర్తించగా పొడిచిన యువకుడిని అక్రమ్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. పోలీసు ఔట్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగినప్పుడు పోలీసు సిబ్బంది ఉండగానే అక్రమ్ ఖాన్ కత్తితో ఫిరోజ్ ఖాన్ పై దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు పాతకక్ష్యలు కారణమని తెలుస్తోంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్ కలుగజేసుకుని ఫిరోజ్ ఖాన్ కు రక్షించారు. స్థానికులు ఫిరోజ్ ఖాన్ ను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. గంజాయి మత్తులో ఉన్న అక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.