ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఆసిఫాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్
Updated on: 2024-04-21 05:52:00

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్.పి కే.సురేష్ కుమార్ ఐపిఎస్ ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖి చేశారు ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అదేవిదంగా పోలీస్ స్టేషన్ లో కేసులకు సంబంధించిన ఫైళ్లను పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు స్టేషన్లో సీసీటీఎన్ఎస్ లోని ఎఫ్ ఐ ఆర్ -చార్జిషీట్ మీసేవ హెచ్ ఆర్ ఎం ఎస్ అన్ని అప్లికేషన్స్లను పరిశీలించారు తదుపరి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా ఉంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు అదేవిధంగా పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో ఎంటర్ చేయాలని తెలియజేశారు సిబ్బంది పోలీసు స్టేషన్ లోని ప్రతి గ్రామం గురించి అవగాహాన కల్గివుండాలని ప్రజలతో మమేకమై, ప్రజలకు మరింత చేరువ కావాలని తెలిపారు ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రతిఫలం దక్కుతుందని తెలియజేశారు