ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం
Updated on: 2024-04-13 07:24:00

దేవరకద్ర నియోజకవర్గం : పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహించిన భూత్పూర్ మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిధులుగా హాజరై పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసిన మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి , దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి (GMR) మాట్లాడుతూ... పూటకో పార్టీ మారే డీకే అరుణకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు, డీకే అరుణ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వెన్నుపోటు పొడవడం ఆమె నైజం అని అన్నారు, గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ స్థానంలో సొంత పార్టీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచి తన తమ్ముడు బీఆర్ఎస్ అభ్యర్థి కి, గద్వాల్ లో సొంత పార్టీ అభ్యర్థి వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన శివారెడ్డికి వెన్నుపోటు పొడిచి తన అల్లుడు బిఆర్ఎస్ అభ్యర్థి తన బంధువు కు అనుకూలంగా డీకే అరుణ వ్యవహరించిన సంగతి యావత్తు గద్వాల్ ప్రజానీకం కోడైకొస్తుందన్నారు, డీకే అరుణ బీజేపీ పార్టీలో కూడా గ్రూపులు కట్టి ఎంతోమంది ఏళ్ల తరబడి కష్టపడ్డ కార్యకర్తలను అణిచివేసిందని, డీకే అరుణ అణిచివేత తట్టుకోలేక వరుస పెట్టి బిజెపి నాయకులు రాజీనామాలు చేస్తున్నారని తెలియజేశారు, ఇప్పటికే అన్ని సర్వేల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని తెలియడంతో ఓటమి భయంతో స్థాయికి మించి ముఖ్యమంత్రి గారి పై డీకే అరుణ విమర్శలు చేస్తుందని... డీకే అరుణ కాంగ్రెస్ కి పోటీనే కాదని, పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లక్షల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి గెలవబోతున్నారని జియంఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు (ఉచిత బస్, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా) అమలు చేసిందని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 లకే గ్యాస్ సిలిండర్ హామీలను నెరవేర్చిందని MLC ఎన్నికల కోడ్ కారణంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈ పథకాలు అమలుకు నోచుకోలేదని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని త్వరలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలియజేశారు, అసెంబ్లీలో ఎన్నికల్లో ఆదరించినట్లే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ఎమ్మెల్యే జియంఆర్ కోరారు.