ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కొడుకు మృతదేహంతో,8 కిలోమీటర్లు నడిచి వెళ్లిన కన్నతండ్రి
Updated on: 2024-04-11 12:31:00
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపో వడంతో కొడుకు మృతదే హంతో తండ్రి ఏకంగా 8 కిలోమీటర్లు నడిచాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంత గిరి మండల పరిధిలోని రొంపల్లి పంచాయతీ చినకోనెలకు చెందిన సార కొత్తయ్య కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా కొల్లూరు వద్ద ఇటుకల బట్టీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన చిన్న కుమారుడు ఈశ్వరరావు (3) సోమవారం అనారో గ్యంతో చనిపోయాడు. దాంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించే ఏర్పాటు చేసుకు న్నారు. అయితే, అంబులెన్స్ డ్రైవర్ వారిని మంగళ వారం సాయంత్రం విజయ నగరం జిల్లా మెంటాడ మండలం వనిజ వద్ద దించేసి వెళ్లిపోయాడు. ఇక అక్కడి నుంచి గ్రామా నికి సరైన రహదారి లేకపో వడంతో మృతదేహాన్ని మోసుకుని కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది..