ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
షాద్ నగర్ లో అరుణమ్మ కు భారీ మెజారిటిని ఇద్దాం
Updated on: 2024-04-08 13:46:00

షాద్ నగర్ లో అరుణమ్మ కు భారీ మెజారిటిని ఇద్దాం ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నిన్న అధికారం రాత్రి కొత్తూరు మండలం గూడూరు, మల్లాపూర్, మల్లాపూర్ తాండ,మక్తగూడ లో బిజెపి ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈయొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈయొక్క సమావేశాన్ని ఉద్దేశించి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు,కార్యకర్తలు కలిసి జట్టుగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ కు షాద్ నగర్ నియోజకవర్గం నుండి లక్ష కు పైగా ఓట్లను ఇద్దామని బిజెపి నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కలిసి కట్టుగా సమన్వయం గా పని చేసినప్పుడే అనుకున్నది సాధిస్తామని అన్నారు. ప్రజలు మోదీ కి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కావున మనం చేయాల్సింది ఒక్కటే ఎన్నికల వరకు ప్రతి ఓటర్ ను నాలుగు అయిదు సార్లు కలవడమే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో జరిగిన అవినీతిని,సైనికుల ఊచకోతలను ఉగ్రవాదం ఎలా ఉండేనో ప్రజలకు వివరిస్తూ మోదీ గారు చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి గడప కు తీసుకెళ్లాలని కోరారు. ఈయొక్క కార్యక్రమం లో బిజెపి నాయకులు అత్తాపురం మహేందర్ రెడ్డి, శివలింగం, ఉప్పల రాఘవేందర్, జైపాల్ రెడ్డి, కంచి శేఖర్, గట్టు హరికృష్ణ,డాక్టర్ నర్సింహా నాయక్,విక్రాంత్ గౌడ్, శేఖర్ గౌడ్, వరుణ్ గౌడ్, విక్రమ్ రెడ్డి, రాఘవేంద్ర చారి, శివ దాస్, బాస్కర్ నాయక్, గుండు సాయి, వసంత్, జగదీష్, ఆనంద్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.