ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అమర్ రాజా బ్యాటరీ గిగా ప్రాజెక్ట్ పనులను వెంటనే ఆపాలి..
Updated on: 2024-04-06 16:59:00

అమర్ రాజా బ్యాటరీ గిగా ప్రాజెక్ట్ పనులను వెంటనే ఆపాలి.. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ సాగర్ కలెక్టర్ రవి నాయక్ గారికి వినతిపత్రం సమర్పించిన బీసీ సమాజ్. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లోని స్థానిక 4 వార్డ్ దివిటిపల్లి, ఎదిర సమీప ప్రాంతంలో అమర్ రాజా బ్యాటరీ గిగా ప్రాజెక్ట్ వెంటనే ఆపాలని ఈరోజు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సాగర్ ఆధ్వర్యంలో కలెక్టర్ రవి నాయక్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది... గత కొంత కాలంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లోని స్థానిక 4 వార్డ్ దివిటిపల్లి, ఎదిర సమీప ప్రాంతంలో అమర్ రాజా బ్యాటరీ గిగా ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తమరికి విదితమే అని ఆయన తెలియజేస్తూ , ప్రాజెక్ట్ విషయమై తీసుకున్న నిర్ణయం పైన స్థానిక వార్డ్ ప్రజలు గత కొంత కాలంగా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు అనే విషయం తమరికి తెలియజేస్తున్నామన్నారు. బీసీ సమాజ్ ఇదే విషయమై తమరితో చేయు విన్నపం ఏమనగా "అమర్ రాజా బ్యాటరీ లిథియం అయాన్ గిగా ప్రాజెక్టు " అనేది సైన్టిఫిక్ పరిశోధనల ప్రకారం విపరీతమైన కాలుష్యాన్ని విడుదల చేస్తుందని, బ్యాటరీ తయారీలో వాడే ముడిపదార్ధాలు కోబాల్ట్,నికెల్,మరియు మాంగనీస్,వంటి లోహాలు ఉంటాయి, ఇవి విషపూరితమైనవి మరియు అవి భూమిలో నీటిని మరియు వాయువుని, పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి కాబట్టి ఇట్టి బ్యాటరీల నుండి వచ్చే వాయువు మరియు కలుషితమైన నీటిని వాడటం వల్ల ప్రజలు రోగాల బారిన పడతారు. దీని ద్వారా వచ్చే రోగాలు లంగ్ క్యాన్సర్ మరియు గుండె సంబంధిత ఇతర వ్యాధులు వస్తాయి. అంతే కాకుండా బ్యాటరీ కంపెనీలో పనిచేసే వారికి కూడా ప్రమాదమే, కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్ అనుమతులపైన మరొక్కసారి తమరు దయతో పరిశీలించి, స్థానిక ప్రజలకు, మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాలు దాదాపుగా చాలా కిలోమీటర్ల వరకు ఉంటుందని ఒక అంచనా. కావున తమరు తగిన రీతిన న్యాయం చేయగలరని శ్రీనివాస్ సాగర్ కోరారు. అంతే కాకుండా ఈ విషయం లో విచారణ జరిగే వరకు ప్రాజెక్ట్ కు సంబంధించి జరుగుతున్న నిర్మాణాలను తక్షణం ఆపివెయ్యమని అమర్ రాజా కంపెనీ కి తగిన రీతిన ఆదేశాలు ఇచ్చి తాత్కాలికంగానైనా ఆపివేసే విదంగా తమరు చర్యలు తీసుకోగలరని ఆయన మనవి చేశారు.. ఈ కార్యక్రమంలో జాండ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్, బీసీ సమాజ్ కో కన్వీనర్ సవారి సత్యం పాల్గొన్నారు...