ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జగిత్యాల జిల్లాలో సర్పంచ్ భర్త ఆగడాలు.పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్యదర్శి.
Updated on: 2023-06-01 17:32:00

చిన్న పదవి ఉంటే వారి ఆగడాలకు అడ్డు.. అదుపూ లేకుండా పోతున్నాయి. ఇక అధికార పార్టీ అయితే సరే సరి.. తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ సర్పంచ్ భర్త .. ప్రభుత్వ అధికారులపై నోరు పారేసుకొని బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ అధికార పార్టీ సర్పంచ్ ఆగడాలు మితిమీరాయి. పంచాయతీ కార్యదర్శిని సర్పంచ్ భర్త రమేష్ బంధించారు.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీర్పూర్ పంచాయతీ కార్యదర్శి సతీష్ విధులకు సర్పంచ్ భర్త పదే పదే అంతరాయం కలిగిస్తున్నాడు. తాను చెప్పిన విధంగా చేయడం లేదని సర్పంచ్ భర్త రమేష్ కార్యదర్శి సతీష్ ను ప్రతిరోజు అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి తిడుతూ చంపుతానని బెదిరించి గదిలో బంధించాడు. ఈ విషయం ఎంపీడీవోకు తెలియడంతో బందీ గా ఉన్న సతీష్ ను బయటకు తీసుకొచ్చాడు. సర్పంచ్ భర్త రమేష్ తన విధులకు తరచు ఆటంకం కలిగిస్తూ.. బెదిరిస్తున్నాడని బీర్పూర్ పంచాయతి కార్యదర్శి సతీష్ జగిత్యాల రూరల్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్ శిల్ప, భర్త రమేష్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ అరిఫ్ అలిఖాన్ తెలిపారు......