ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
8ఏళ్ళు కోర్టు లో జరిగిన కేసు
Updated on: 2024-04-02 15:25:00

బోగోలు కు చెందిన ఎంపిటిసి చెలపతి వెంకటేశ్వర్లును ఆకారణంగా కొట్టి దురుసుగా మాట్లాడిన ఎస్సై వెంకటరమణ 2016జూన్ 24న బిట్రగుంటలో టీ తాగుతుండగా అకారణంగా కొట్టి మానవ హక్కులకు భంగం కలిగించిన ఎస్సై కోర్టును ఆశ్రయించిన బాధితుడు చెలపతి వెంకటేశ్వర్లు 8ఏళ్ళు కోర్టు లో జరిగిన కేసు విచారణలో నేరం రుజువు కావడంతో ఎస్ఐ వెంకటరమణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10000 జరిమానా జైలు శిక్ష, జరిమానా విధించి తీర్పు వెల్లడించిన మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి గతంలో ఎన్నో కేసులో ముద్దాయి గా ఉన్న ఎస్ఐ వెంకటరమణ వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన ఎస్సై వెంకటరమణ చాలా చోట్ల సస్పెండ్ కు గురైన ఎస్సై వెంకటరమణ నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన నాటి ఎంపీటిసి సభ్యులు వెంకటేశ్వరరావు పట్ల దురుసుగా ప్రవర్తించి మానవ హక్కుల ఉల్లాంఘన పాల్పడినట్లు నమోదైన కేసులో గతంలో ఎస్సై వెంకటరమణ కు ఆరు నెలలు జైలు శిక్ష, 10వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి సోమవారం తీర్పు చెప్పారు. పిర్యాది వివరాలు మేరకు బోగోలుకు చెందిన వెంకటేశ్వరరావు ఎంపీటిసి సభ్యులు గా ఉంటూ వ్యవసాయం చేసుకొనే వారు. 2016 జూన్ 24న బిట్రగుంటలో వెంకటేశ్వర్లు టీ తాగుతుండగా ఎస్సై వెంకటరమణ అకారణంగా కొట్టి మానవ హక్కులకు భంగం కలిగించారని బాధితుడు కోర్టును ఆశ్రయించారు. 8ఏళ్ల పాటు కోర్టులో కేసు కొనసాగింది. సోమవారం కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ఎస్ఐ వెంకటరమణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10000 జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి సోమవారం తీర్పు చెప్పారు.పిర్యాదు తరుపున న్యాయ వాది కె పిఎస్ మణి కేసు వాదించారు.