ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
తెరుచుకొని ప్రభుత్వ బడి - మండలంలో ప్రభుత్వ చదువుల పైన నీలి నీడలు
Updated on: 2024-03-31 12:19:00

కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉదయం 7గంటల 45 నిమిషాలకు తెరుచుకోవాల్సి ఉన్న 8 గంటల 30 నిమిషాలు దాటిన తెరుచుకోలేదు. మండలంలో విద్యావ్యవస్థ పైన ప్రజాప్రతినిధులు, ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యావ్యవస్థ గాలిలో దీపంలా సాగుతుంది. ప్రభుత్వాలు విద్యావ్యవస్థ పటిష్ట కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్న క్షేత్రస్థాయిలో అమలుకోవడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. మండల కేంద్రం హైదరాబాద్ కు దూరంగా ఉండటంతో చాలామంది ఉపాధ్యాయులు అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుండడం వల్ల డిప్యూటేషన్ల వైపు మొగ్గు చూపారు. డిప్యూటేషన్ల వల్ల ఉపాధ్యాయులు వెళ్లడం వల్ల చదువు చెప్పేందుకు విద్య వాలంటీర్లు కొన్ని పాఠశాలలో దిక్కయ్యారు. ఉన్న ఉపాధ్యాయులు కూడా సక్రమంగా పాఠశాలలకు సమయపాలనతో రాకపోవడంతో విద్యార్థులు చదువు అగమ్య గోచరంగా తయారైంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి అయినా మండలంలో విద్యా వ్యవస్థ ప్రతిష్టకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యా శాఖ ఉన్నతాధికారు ప్రత్యేక దృష్టిని పెట్టి మండలంలో విద్యా వ్యవస్థ ప్రతిష్టతకు కృషి చేయాలి. వచ్చేవిద్య సంవత్సరం నుండి మండలం నుండి డిప్యూటేషన్ల పైన వెళ్లిన ఉపాధ్యాయులను తిరిగి పాఠశాలకు తీసుకువచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేయాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.