ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
సాలూరు: రెండో సారి తలపడుతున్న రాజన్నదొర సంధ్యారాణి.
Updated on: 2024-03-16 21:35:00

సాలూరు: సాధారణ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, ప్రధాన పార్టీల అభ్యర్థులెవరో తేలిపోవడంతో నియోజకవర్గం లో ఎన్నికల వేడి రాజుకుంది.టిడిపి అభ్యర్థిగా సంధ్యారాణి ని ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది.సంధ్యారాణి మొదటి సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా 1999 ఎన్నికల్లో పోటీ చేశారు.అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి ఎల్ ఎన్ సన్యాసి రాజు చేతిలో ఓడిపోయారు.2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాజన్నదొర చేతిలో ఓటమి పాలయ్యారు.ఇప్పుడు మళ్ళీ టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.ఆమె 2014 ఎన్నికల్లో అరుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంధ్యారాణి విద్యావంతురాలు, మాటకారి.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆమెకు టిడిపి అధిస్థానం ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చింది.ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఇంతవరకు గెలిచిన సందర్భాలు లేవు.2024 ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.