ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
అవసరమైన నిధులను జిల్లా బ్యాంకు నుండి అందిస్తాం
Updated on: 2024-03-14 14:29:00

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని గురువారం ప్రారంభించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పిఎసిఎస్ కొనుగోలు కార్యాలయాన్ని జాతీయ సహాకార బ్యాంకుల సమైక్య, తెలంగాణ రాష్ట్ర అపెక్స్ బ్యాంకు, కెడిసిసి బ్యాంక్ కరీంనగర్ అధ్యక్షులు కొండూరు రవీందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం లాభాల్లో ఉన్నందున పని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సంఘం గూడూరు స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను జిల్లా సహకార బ్యాంకు ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లు రమేష్ బాబు, సత్యనారాయణ రావు, రాజేశ్వరరావు, సురేందర్, శ్రీనివాస్, హెడ్వర్డ్, చోటమియా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.