ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
వేసవిలో నీటి ఎద్దడి తలేత్తకుండా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్
Updated on: 2024-03-12 19:19:00

వేసవిలో నీటి ఎద్దడి తలేత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం గద్వాల్ పరిధిలోని గోనుపాడు గ్రామంలో మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరాను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేసవిలో త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. నీరు వృధా కాకుండా చూడాలని, ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని సూచించారు. లీకేజీలు లేకుండా చూసుకోవాలని, తెలిపారు. ఈ సందర్భంగా త్రాగు నీరు, బల్క్ వాటర్ సౌలభ్యత, నీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయితి కార్యాలయంలో నీటి సరఫరాకు సంబంధించిన ఏడు రిజిస్టర్లను, క్లోరోస్కోప్ ద్వారా నీటి స్వచ్ఛతను పరిశీలించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.