ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలను మార్చండి
Updated on: 2024-03-12 04:36:00
కరెంటు తీగలు తెగి పడటం వల్ల పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు సోమవారం విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు తుప్పు పట్టడంతో కాలం చెల్లిపోయాయని, విద్యుత్ తీగలు తెగడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ శాశ్వత పరిష్కారం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కూడా విద్యుత్ తీగల తెగి కట్టెలపై పడటంతో భారీ ఎత్తున మంటలు చేరడానికి స్థానికంగా ఇబ్బందులు పడినట్లు గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నపాటి గాలి వానలకు తెగిపడితే ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై గ్రామ సభలో కూడా వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కాలం చెల్లిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.