ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు:హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
Updated on: 2024-03-04 13:26:00
పశ్చిమగోదావరిజిల్లా:రాజకీయ జీవితం చివరి చరమాంకం వరకు జనసేనలోనే ఉంటానని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య స్పష్టం చేశారు.తనపై వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు.ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటా.టీడీపీ అధినేత చంద్రబాబు,ఆయన తనయుడు లోకేష్‌ల భవిష్యత్తు కోరుకునే కొందరు జనసేన సలహాదారులు నా పనులను సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తున్నారు.వారు జనసేన గొడుగులో ఉండే కోవర్టులు.ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా నేను చేయాలనుకున్నదే చేస్తాను.నాకు కావాల్సిందల్లా పవన్ రాజకీయ ఎదుగుద అని జోగయ్య స్పష్టం చేశారు.