ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
హత్య కేసులో ముద్దాయి కి జీవిత ఖైదు , జరిమానా
Updated on: 2024-02-23 19:13:00

అనకాపల్లి జిల్లా రోలుగుంట పోలీస్ స్టేషన్ లో 2017 మే 22 న నమోదైన కేసులో నిందితుడైన అద్దేపల్లి అప్పారావు, ( 50 ) హత్య చేసిన కేసులో విశాఖపట్నం XII వ ఏ డి జె కోర్టు జీవిత కాలం కఠిన కారాగార శిక్ష మరియు రూ.2,000/- జరిమానా విధించారని , జరిమానా కట్టని పక్షంలో మరో 2 నెలల సాధారణ జైలు శిక్ష విధస్తూ ఫిబ్రవరి, 23 న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ, తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం 2017 మే 21 న గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద హరిభజన కార్యక్రమం సందర్భంగా మృతుడు అక్కడికి వెళ్లి భజన అనంతరం నిందితుడి భార్య నూకలతల్లి తో రాత్రి 01.15 గంటల సమయంలో నిందితుడి ఇంటి మేడ పైన కలిసి ఉండగా, ఇది గమనించిన నిందితుడు మేడ పైకి వచ్చి చూసి కోపోద్రిక్తుడై మృతుడు మంత్రి సత్తి బాబును ఇటుక బెడ్డతో దాడి చేసి తలపై కొట్టి గాయపరిచినట్లు, మృతుడు చెవి, నోరు, ముక్కు నుండి రక్తం కారి చనిపోయినట్లు సదరు విషయం తెలిసి మృతుడు అన్నయ్య (ఫిర్యాది) మరియు గ్రామస్తులు రోలుగుంట పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ కేసును అప్పటి కొత్తకోట సిఐ జి.కోటేశ్వరరావు దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారన్నారు. ఈ కేసును రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రయారిటీ కేసుల్లో భాగంగా ఈ కేసును జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఆద్వర్యంలో విచారణ జరపడం అయినది. తదుపరి విచారణ పూర్తయిన తర్వాత XII వ ఎ.డి.జె కోర్టు, విశాఖపట్నం న్యాయమూర్తి పి.గోవర్ధన్ ముద్దాయి అయిన అద్దేపల్లి అప్పారావు కు జీవిత కాలం కఠిన కారాగార శిక్ష మరియు రూ.2,000/- జరిమానా విధించారు. జరిమానా కట్టని పక్షంలో 2 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు.