ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
గద్దెకు చేరిన సారలమ్మ
Updated on: 2024-02-22 08:41:00

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో మొదటి ఘట్టం ముగిసింది. సారలమ్మ నిన్న గిరిజన పూజారుల, భక్తుల కోలాహలం మధ్య రాత్రి 12: 18 నిమిషాలకు గద్దెకు చేరుకుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క పర్యవేక్షణ లో సారలమ్మ మేడారం గద్దెకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు అయ్యాక గోవిందా రాజు లు, పగిడిద్దా రాజు లతో కలిసి గద్దెకి సారాలమ్మ గద్దెకు చేరి మొక్కులు పొందుతున్నారు. రెండు గంటలు కన్నెపల్లి సారాలమ్మా గుడిలో జరిగిన పూజల అనంతరం ప్రధాన పూజారి సారయ్య అమ్మవారిని గద్దెల మీదకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ లు సారాలమ్మాలకు ప్రత్యేక పూజలు చేసి కన్నెపల్లి గ్రామస్తులతో కలిసి గిరిజన సాంప్రదాయ నృత్యం చేసారు.