ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఘనంగా మేడారంలో మండే మెలిగే పండుగ
Updated on: 2024-02-14 20:33:00

ములుగు జిల్లాలోని మేడారం మహజాతరకు అంకురార్పణ జరిగింది. ఈరోజు మండమెలిగే పండుగను గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించారు. మేడారంలో సమ్మక్క, కన్నేపల్లిలో సారలమ్మ, కొండాయి లో గోవిందరాజు, పూనుగుండ్లలో పగిడిద్దరాజు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క-సారలమ్మల వనదేవతలకు దిష్టి తగలకుండా ఊరు చుట్టూ రక్షబంధనం ఏర్పాటు చేశారు. అమ్మవార్ల ఆలయం ముందు రోడ్డుకు ఇరువైపులా కర్రలు పాతి కోడి, మామిడాకులు, పండుమిరపకాయలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ జరుపుకున్నట్లు పూజారులు చేశారు. ఫిబ్రవరి 21 నుండి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మేడారం మహాజాతర జరగనుంది.