ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
చెర్వుగట్టు జాతర ఈ నెల 14 నుంచి 21 వరకు
Updated on: 2024-02-13 07:03:00

నార్కట్పల్లి, ఫిబ్రవరి 12 : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 14 నుంచి 21 వరకు జరిగే జాతరకు జిల్లా అధికారులు, దేవాలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు బ్రహ్మోత్సవాలకు సుమారు 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని దేవాలయ సిబ్బంది అంచనా.ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు నల్లగొండలోని రామాలయం నుంచి నగరోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 16న శుక్రవారం రాత్రి(తెల్లవారితే శనివారం17వ తేది) స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 18న ఆదివారం (తెల్లవారితే సోమవారం) స్వామి వారి అగ్నిగుండాలు, 19న సోమవారం(తెల్లవారితే మంగళవారం) దోపోత్సవం, అశ్వవాహన సేవ జరుపుతారు. 20న మంగళవారం రాత్రి మహా పూర్ణావృతి, పుష్పోత్సవం, ఏకాంత సేవలు నిర్వహిస్తారు. 21న బుధవారం సాయంత్రం 4 గంటలకు గజ వాహనంపై చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు పరిపూర్ణం చేస్తారు.