ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
డ్వాక్రా మహిళలతో ఘనంగా మనసారా ఆసరా ఉత్సవాలు
Updated on: 2024-02-03 20:19:00

పశ్చిమగోదావరి జిల్లా:ఈనెల 8వ తేదీ వరకు మనసారా ఆసరా సంబరాలు నిర్వహించడం జరుగుతుందనీ మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు అన్నారు.ఆచంట నియోజకవర్గ స్థాయిలో పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు మైదానంలో అయిదవ రోజు మనసారా ఆసరా సంబరాలు శనివారం ఘనంగా జరిగాయి.సుమారు 12,000 డ్వాక్రా మహిళలు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు.చంటి పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాలు సదుపాయం కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే రంగనాధ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళల జీవన స్థితిగతులు మార్చేందుకు,వారి ఆరోగ్య సంరక్షణ,వారి పిల్లల విద్యకోసం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు వివరించడం జరుగుతుందనీ ,ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా విచ్చేసి ఎంతో ఆనంద వ్యక్తం చేస్తున్నారన్నారు.ప్రతి ఒక్క మహిళా నా తోబుట్టువులా భావించి వారికి భోజన సదుపాయం చీరె పంపిణీ చెయ్యడం జరుగుతుందని ఆయన అన్నారు.ప్రతి పక్ష పార్టీలు బెదిరించి,బలవంతంగా తీసుకొస్తున్నారు అని దుష్పచారం చేస్తున్నారు.ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం.మిగిలిన చోట్ల మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అలాగే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకే కాకుండా లేని వాళ్ళకు భోజనం సదుపాయం ఏర్పాటు చేసి చీర ఇవ్వడం జరుగుతుందనీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న ప్రతి ఒక్క మహిళలు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.