ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
Updated on: 2024-02-02 16:16:00

గుడివాడ శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాని,ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి దర్శన కార్యక్రమాల అనంతరం బయటకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. దర్శన అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.శ్రీవారి దీవెనలు సీఎం జగన్ ఆయన కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, స్వామివారి కృపతో మంచి కోసం పనిచేసే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత ఎన్నికలకు మించి, ఫలితాలు సాధిస్తుందని ఆయన అన్నారు.