ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ గదిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని
Updated on: 2024-01-28 11:41:00

నంద్యాల జిల్లా:ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో విద్యార్థిని ప్రసవించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాణ్యం శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడు నెలల క్రితం ఓ యువతి బిటెక్ ఫస్ట్ ఇయర్లో చేరింది. కాలేజీకి సంబంధించిన హాస్టల్ లోనే ఉంటూనే చదువు కొనసాగిస్తోంది.శనివారం రాత్రి 9 గంటలకు బాత్రూమ్ లో సదరు విద్యార్థిని పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి స్పృహ కోల్పోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.రక్తస్రావం ఎక్కువగా కావడంతో మెరుగైన చికిత్స కోసం నంద్యాల జిల్లా ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ విద్యార్థిని చనిపోయింది.కాలేజీ యజమాన్యం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.