ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
Updated on: 2024-01-26 21:59:00

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ , జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ జాతీయ పతాకావిష్కరణ చేసి సిబ్బందికి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26న భారతదేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని , స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారతదేశంలో పరిపాలన కొరకు అత్యంత ఆవశ్యకత కలిగిన తన సొంత రాజ్యాంగం అమలు చేయాలని నిర్ణయించుకుని, రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందన, అప్పటి నుంచి దేశం ప్రజాతంత్ర పరిపాలన కలిగిన సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందన్నారు. అనంతరం అనకాపల్లి పట్టణం, ఎన్.టి.అర్ మైదానం నందు పోలీసుల నుండి జిల్లా కలెక్టర్ , ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ గారు ఎగురవేసి, ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పోలీసు పరేడ్ ను పరిశీలించారు.