ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
స్పందన ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం,ఈ వారం 51 విజ్ఞప్తుల వచ్చాయి:జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
Updated on: 2024-01-19 20:27:00

అల్లూరి జిల్లా పాడేరు:ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని,ముందస్తు అనుమతి పొంది మాత్రమె కింది స్థాయి సిబ్బందిని పంపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.శుక్రవారం ఐటిడిఎ సమావేశమందిరంలో జరిగిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,ఫిర్యాదుదారుల నుండి 51 విన్నపాలు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో అందిన ఫిర్యాదుల పై వెంటనే స్పందించి విచారాణాదికారిని నియమించాలని,సమస్య పరిశ్కారానికి చొరవ చూపి,పరిష్కార చర్యను సంబంధిత ఫిర్యాదుదారునికి తెలియజేయాలని ఆదేశించారు.అదేవిధంగా జగనన్నకు చెబుదాం పోర్టల్ లో అందిన ఫిర్యాదులపై కూడా సకాలంలో స్పందించాలని ఆదేశించారు.కొంతమంది అధికారులు సకాలంలో లాగిన్ అవ్వక పోవటం,సమస్య పరిష్కారం కాకుండా ఐనట్లు అప్లోడ్ చేయడం లాంటివి గుర్తించామని,అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం,26న గణతంత్ర దినోత్సవ వేడుకలలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ కోరారు.22,23 తేదీలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సెల్ టవర్ల ప్రారంభం అవుతుంది అని ఈ నెల 22 లేదా 23 వ తేదీన జిల్లాలో 300 సెల్ టవర్ల ప్రారంభాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి వి. అభిషేక్ తెలిపారు.గతంలో హుకుంపేట మండలం భీమవరం,జి.మాడుగుల మండలం సుబ్బులులో ఏర్పాటు చేసిన కార్యక్రమం విజయవంతం చేయడ౦ జరిగిందని గుర్తు చేస్తూ,ఈ నెలలో జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పిఒ సూచించారు.ఆ రోజు పాడేరు మండలం ఈదులపాలెం,డు౦బ్రిగుడ మండలం లయగండలో వర్చువల్ ప్రారంబం ఏర్పాట్లు చేస్తున్నట్లు అభిషేక్ వివరించారు.ఈ స్పందన కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కె.కార్తిక్,సబ్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, డిఆర్ఒ వివి.రమణ అర్జీదారుల నుండి స్పందన విజ్ఞప్తులు స్వీకరించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,ఐటిడిఎ అధికారులు పాల్గొన్నారు.