ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
వార్షిక తనిఖీలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డిఐజి
Updated on: 2023-12-26 21:23:00

అనకాపల్లి జిల్లా:విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను,సబ్ డివిజన్ కార్యాలయ్యాల్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. నేరాలను అరికట్టటలో గ్రామ/వార్డు సచివాలయ మహిళ పోలీసుల పాత్ర కీలకమని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ తెలిపారు.జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలోని అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సమాచారాన్ని డీఐజీ కి వివరించారు.డీఐజీ సిబ్బంది వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ పరిసరాలను,ఎస్.హెచ్.ఓ,రైటర్, కంప్యూటర్ గదులను,కేస్ ప్రాపర్టీ భద్రపరిచిన గదిని పరిశీలించి,కేసు ప్రాపర్టీ సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలన్నారు. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ మహిళ పోలీసుల సహాయంతో బాల్యవివాహాలను అరికట్టాలని, సైబర్ క్రైమ్స్, రోడ్డు భద్రతా నియమాలు గూర్చి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు.పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి,రౌడీలు,సస్పెక్ట్ లు,పాత నేరస్తులు ఎవరు ఉన్నారు, వారి కదలికలు గురించిన వివరాలను, స్థల వివాదాలు,కుటుంబ తగాదాలు,వర్గ విభేదాలు గురించిన సమాచారాన్ని, గతంలో ఎటువంటి నేరాలు జరిగినయి, అందులో ముద్దాయిలు ఎవరు బాధితులు ఎవరు వారి ప్రస్తుత జీవన విధానం వంటి విషయాల గురించి విపులంగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం అనకాపల్లి సబ్ డివిజన్ కార్యాలయా రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.