ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రామప్పలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు
Updated on: 2023-12-19 07:57:00
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప రామలింగేశ్వరస్వామిని మంత్రి సీతక్క సోమవారం కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి పట్టువస్త్రాలను మంత్రికి అందజేసి ఆశీర్వదించారు..ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు కృషిచేస్తానన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న టూరిజం భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సందర్శించి మ్యాప్ ను పరిశీలించారు. అందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు.