ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
Updated on: 2023-12-02 18:15:00
కర్నూలు:కర్నూలు మెడికల్ కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు ఆరోపించడం కలకలం రేపింది.సీనియర్ల వేధింపుల పై ఏకంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది.తమ రికార్డులు రాసి పెట్టాలని,తమ గదికి భోజనాలు తీసుకురావాలని సీనియర్లు వేధిస్తున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై కలగజేసుకోవాలని,తమకు వేధింపులు తప్పేలా చర్యలు తీసుకోవాలని జూనియర్ విద్యార్థులు యూజీసీకి లేఖ రాశారు.ఈ ఫిర్యాదుతో స్పందించిన యూజీసి ర్యాగింగ్ విషయాన్ని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది.కాలేజీలో,విద్యార్థుల హాస్టల్స్లో ర్యాగింగ్ నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ఇటీవలే కాలేజీ అనుబంధంగా ఉన్న మెన్స్ హాస్టల్లో గంజాయి,మద్యం సీసాలు బయటపడడం సంచలనం సష్టించింది.దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈలోపే కాలేజీ మరోసారి వార్తల్లో నిలిచింది.