ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అర్ధరాత్రి కేంద్ర బలగాలు అధీనంలోకి నాగార్జున సాగర్
Updated on: 2023-12-02 08:29:00

నల్లగొండ:నాగార్జున సాగర్‌ను కేంద్ర బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి.అర్ధరాత్రి సాగర్ డామ్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి.సాగర్ డ్యాం మొత్తాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.నిన్న సాయంత్రం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు,డీజీపీలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి మాట్లాడారు.కేంద్ర బలగాలు రెండు రాష్ట్రాలను అధీనంలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపాయి.దీంతో అర్ధరాత్రికే సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం పంపింది.సాగర్‌కు ఏపీ వైపు ఏపీ బలగాలు,తెలంగాణ వైపు ఆ రాష్ట్ర పోలీస్‌లు పహారా కాస్తున్నారు.ఇప్పటికే కేఆర్ఎంబీ సభ్యులు సాగర్‌కు చేరుకున్నారు.పరిస్థితి పై కేంద్రానికి నివేదిక అందించారు.ఏపీ ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి వ్యవహరించిందని కేఆర్ఎంబీ నివేదికను పంపించింది.ఇండెంట్ లేకుండా,కనీసం లేఖ కూడా రాయకుండా ఏపీ నీటి విడుదల చేసిందని పేర్కొంటూ నివేదిక అందించడం జరిగింది.ముందు ఏపీ ఇచ్చిన ఇండెంట్ ప్రకారం జనవరి,ఏప్రిల్‌లో 5 టీఎంసీల చొప్పున నీటి విడుదల చేయాల్సి ఉందని కేఆర్ఎంబీ పేర్కొంది.