ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
టీఆర్ఎస్ హఠాత్తుగా బీఆర్ఎస్గా మారింది:ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు
Updated on: 2023-11-25 16:52:00

కామారెడ్డి:వాగ్దానం ఇచ్చామంటే అమలు చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని చెప్పారు.కామారెడ్డి నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం దక్కిందని అన్నారు.టీఆర్ఎస్ హఠాత్తుగా బీఆర్ఎస్గా మారిందని,యూపీఏ కాస్త ఇండియా కూటమిగా మారిపోయిందని విమర్శించారు.ఇక్కడ జన ప్రవాహం కనిపిస్తోంది. తొమ్మిదేళ్ల వారి పాలనపై ప్రజలు విసిగిపోయారు.ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ నుంచి విముక్తి కోరుతున్నారు.ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా విధానాలు ఉన్నాయి.నేను ఇచ్చే మాటలే గ్యారంటీ. దేశానికి బీసీని ప్రధాని చేసింది కూడా బీజేపీనే.తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు డబ్బులు అవసరమైనా అప్పుడు నీటి పారుదల పథకాలు పెట్టుకున్నారు.ప్రజాధనం అంతా కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్ళింది అని మోదీ అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆదివారం,సోమవారం కూడా ప్రచారం నిర్వహించనున్నారు.