ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
తరుగుని ప్రశ్నించారని రైతులపై దాడి.
Updated on: 2023-05-16 10:03:00
ధాన్యం కొనుగోలులో తరుగును ప్రశ్నించిన ఓ గ్రామ సర్పంచుతో పాటు ఇద్దరు రైతులపై రైస్‌మిల్లు నిర్వాహకులు దాడి చేసిన ఘటన ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో చేటు చేసుకుంది. నిజాంసాగర్ మండలం నర్సింగ్‌రావ్ పల్లి గ్రామంలో అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం నుంచి పిట్లం మండలంలోని కుర్తి గ్రామశివారులో ఉన్న వైష్ణవి రైస్ మిల్లుకు నాలుగు రోజుల క్రితం లారీని పంపించారు.లారీని డ్రైవర్ గేటు బయట పెట్టి వెళ్లాడు. మూడు రోజుల వరకు ఆన్లోడ్చేయలేదు.తర్వాత లారీలో 761 బస్తాలు తరలిస్తే 57 బస్తాలను తరుగు పేరిట మిల్లు యజమానులు కోత విధించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సాయిలుతో పాటు ముగ్గురు రైతులు రైస్ మిల్లుకు వెళ్లారు.57 బస్తాల కోత విషయమై రైస్ మిల్లు నిర్వాహకులను, యజమానులను నిలదీశారు. ఈ విషయమై మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలిసింది.ఆగ్రహించిన రైస్ మిల్లు యజ మానిని రాంరెడ్డి అనే రైతు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో రైస్ మిల్లు నిర్వాహకులు రైతు రాంరెడ్డిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. రాజిరెడ్డి అనే మరో రైతుపైనా దాడి చేశారు.రైతులపై దాడి చేస్తున్న రైస్ మిల్లు నిర్వాహకులను నిలువరించే ప్రయత్నం చేసిన సర్పంచ్ సాయిలను దూషించడంతో పాటు బయటకు గెంటి వేసినట్లు తెలిసింది.