ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్.,
Updated on: 2023-11-20 19:28:00

కరీంనగర్ కమీషనరేట్ లో గల చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ను సోమవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. ఎన్నికల నేరస్థుల, రౌడీ షీటర్ల వివరాలు తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని అవసరమైన అన్నీ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు, లు నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలని, పాత ఎన్నికల నేరస్థులు, రౌడీ షీటర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎన్నికల ప్రక్రియ కు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందితో వారికి కేటాయించబడ్డ ప్రాంత పరిధి గురించి అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం ఎక్కువగా జరగనున్నందున రెట్టించిన ఉత్సాహంతో, పటిష్ట ప్రణాళికతో పనిచేయాలన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని, గుర్తిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. నిఘా వ్యవస్థను పటిష్ట పరచి అనుమతి లేని సమావేశాలు, విందు కార్యక్రమాలు, అక్రమ పంపిణీలను గుర్తించి భాద్యులతో పాటు సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఓటర్లను ప్రభావితం చేసే ఎన్నికల నేరస్థులపై, రౌడీ షీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయాలనీ, ఉల్లంఘిస్తే బౌండ్ డౌన్ చేసి పూచికత్తు సొమ్ము మొత్తాన్ని జప్తు చేయాల్సి వస్తుందని మరియు జైలు శిక్షకూడా విధించబడుతుందని, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోలీస్ వారికి పూర్తిగా సహకరించాలని, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే ప్రయత్నం చేసిన లేదా పాల్పడిన చాలా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల నియమావాళిని రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పక్కాగా అమలు పరచాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్. హెచ్. ఓ. సబ్ ఇన్స్పెక్టర్, బి. రాజేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.