ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
నేడు భద్రాద్రిలో కేటీఆర్ పర్యటన..రామాలయ దర్శనం, రోడ్ షో
Updated on: 2023-11-19 09:45:00

రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు.హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో ఉదయం భద్రాచలం నగరానికి చేరుకుంటారు.11 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం ఉంటుంది.అనంతరం బీఆర్ ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి తైలం వెంకట్రావు విజయాన్ని కాంక్షిస్తూ నగరంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.మధ్యాహ్నం ఒంటిగంటకు ఇల్లెందు నగరానికి చేరుకుంటారు.బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియానాయక్ విజయాన్ని కాంక్షిస్తూ అక్కడ రోడ్ షో నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా కేంద్రం కొత్తగూడెం చేరుకుంటారు.అక్కడ బీఆర్ ఎస్ అభ్యర్థి వన్మా వెంకటేశ్వరరావు గెలుపు కోసం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేటకు చేరుకుంటారు.బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షోలో పాల్గొంటారు.బీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ముగిసిన కొద్ది రోజులకే మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి రావడంతో పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది.కాగా,మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ మధు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.