ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
భూమిని కాపాడాల్సిన అధికారులే భూమిని కాజేస్తున్నారు
Updated on: 2023-05-12 10:16:00
భూముల తారుమారులో రెవిన్యూ అధికారుల పాత్ర. పదిమంది పై చీటింగ్ కేసు నమోదు కు ఆదేశించిన గద్వాల కోర్టు. చిటింగ్ లో రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్, రిటైర్డ్ ఆర్డీఓ, డిటి, వీ ఆర్ వో లు ,మహబూబ్‌నగర్ పట్టణ పరిసర ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు లో దర్జాగా పాగా వేసేశారు. తాజాగా గద్వాల కోర్టు ఓ కేసు వ్యవహారంలో ఇచ్చిన తీర్పు భూ అక్రమార్కులకు చెంప పెట్టులా మారింది. ప్రభుత్వ భూముల వ్యవహారంలో చీటింగ్ చేసిన వారితోపాటు వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కేసు కూడా నమోదవగా.. ఇందులో రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్, రిటైర్డ్ ఆర్డీఓ పేర్లు ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.