ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
నూతన పోలీస్ కమీషనరరేట్ కార్యాలయంలో మొదటిసారిగా కమీషనరేట్ పరిధిలోని అందరి అధికారులతో సమీక్ష సమావేశం.
Updated on: 2023-05-11 07:40:00

నూతన పోలీస్ కమీషనరరేట్ కార్యాలయంలో మొదటిసారిగా కమీషనరేట్ పరిధిలోని అందరి అధికారులతో సమీక్ష సమావేశం. నూతన కమిషనరేట్ భవన పరిశుభ్రత, పరిరక్షణపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు, వివిధ విబాగాల అధికారులతో కమిటి ఏర్పాటు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన (500) పోలీస్ అధికారులకు, సిబ్బందికి రివార్డ్ మేళా.* పెండింగ్ కేసుల పై సమీక్ష. ప్రతి గ్రామంలో తప్పనిసరిగా సుమారు రెండు సి.సి. కేమరాల ఏర్పాటు (Minimum two CCTV Cameras for village Project) లో బాగంగా సిసి కేమరాల ఏర్పాటు పై సమీక్షా, ఆదేశాలు. కమీషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(TTI) ఏర్పాటుపై సమీక్ష. గంజాయి అక్రమ రవాణా, అమ్మకం మరియు నమోదైన NDPS ఆక్ట్ కేసులపై సమీక్ష, ఆదేశాలు. వివిధ నేరాలలో నేరస్తులకు శిక్షలు పడేవిదంగా తీసుకోవలసిన చర్యలు Functional Vertical అధికారులు ,సిబ్బంది పనితీరు శిక్షణ లపై సమీక్ష కమీషనరేట్ పరిధిలో SHE బృందాలచే హాట్ స్పాట్ ప్రాంతాల గుర్తింపు ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనం ప్రారంభోత్సవం జరిగిన తరువాత మొదటి సారిగా రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి IPS (డి.ఐ.జి) గారు పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధి పోలీస్ అధికారులతో నేరా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత రెండు నెలలు గా నిర్వహించిన స్పోర్ట్స్ మీట్, ఇట్టి కమిషనరేట్ పరిధిలోని మారుమూల ప్రాంతం వరకు కూడా నేరా నియంత్రణ, ప్రజల రక్షణ కోసం సిసి కెమెరాల ఏర్పాటు, కమిషనరేట్ పోలీస్ ఆఫీస్ ప్రారంభం కార్యక్రమంలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన మంది 500 పోలీస్ అధికారులకు, సిబ్బందికి మెగా రివార్డ్ మేళా నిర్వహించడం జరిగింది. నూతన పోలీస్ కమిషనరేట్ భవనంలో అన్ని విభాగలకి సంబంధించిన కార్యాలయాలు.. Administrative office, Cyber Crimes Wing, Legal Cell, Finger Print Unit (FPU), Call Data Records (CDR) analysis wing, I.T Core Team, Commissionerate Crime Records Bureau (CCRB), Police Control Room (PCR), I.T & Communications wing, Task Force, Commissionerate Special Branch (CSB), Command and Control Room, Anti Human Trafficking Unit, Cyber Safety lab, Training labs, Multipurpose training hall, Traffic Command Control room, Public Grievance Cell, Passport application reception centre ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించడానికి అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల అనుగుణంగా, భవిష్యత్తు ప్రణాళిక తో ఇట్టి నిర్మాణంని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు పూర్తి రక్షణ, భద్రత కల్పించుటకు వినూత్నమైన, సంస్థాగతమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రజలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది.పోలీస్ అధికారులు సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలు అందిస్తాం అని తెలిపారు.* ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నూతన భవనం మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యుత్ ను & నీటిని వృధా చేయకూడదని సూచించారు.బిల్డింగ్ మెయింటైనేన్స్ కోసం వివిధ వింగ్స్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం , రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భవిష్యత్తు లో పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల లో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా,అమ్మకం పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పెద్దపల్లి ,మంచిర్యాల జిల్లాలో నేరాల నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు,పెండింగులో ఉన్న కేసుల వివరాలను రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్ (డి.ఐ.జి) గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో నేరాలకు పాల్పడిన నేరస్తులకు కోర్టులో శిక్షలు పడే విధంగా చూడాలని అన్నారు.ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజా మన్ననలు పొందేలా ముందుకు సాగాలన్నారు.దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా పోలీసుల గౌరవం మరింత ఇనుమడించేలా పని చేయాలని సీపీ మేడమ్ గారు సూచించారు. ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సిసి టీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో సీపీ మేడం గారు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రతి గ్రామంలో సుమారు రెండు సి.సి. కేమరాల ఏర్పాటు (Minimum two CCTV Cameras for village Project) భాగంగా సిసి కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను అవగాహన పరుస్తూ సిసి కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అందరు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. గత రెండు నెలలలో Minimum two CCTV Cameras for each village Project) లో భాగంగా 648 గ్రామాలు మరియు 110 ఆమ్లెట్ గ్రామాలలో 2978 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది.* నేరం చేసే వాడికి శిక్ష పడాలి, నేరం చేయని వారికి రక్షణగా ఉండాలనే లక్ష్యంతో సాంకేతికపరమైన సంస్కరణలు తీసుకురావాలని అన్నారు. పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తున్న షీ టీమ్స్ పనితీరుపై సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనర్లకు కొత్తగా హాట్ స్పాట్ లను గుర్తించి అట్టి ప్రాంతాలలో నిగవ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్ కి కళాశాలలకి సెలవులు కావున విద్యార్థిని విద్యార్థులు ప్రలోభాలకు,ఆకర్షణలకు గురై ఇంటి నుండి వెళ్లిపోవడం భవిష్యత్తు నాశనం చేసుకోవడం వంటి పనులు చేయడం జరుగుతుంది.షీ టీమ్స్ ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి,ట్రైనింగ్ లు నిర్వహించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని అధికారులకు సీపీ గారు ఆదేశించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గారు IPS, మంచిర్యాల డిసిపి సుధీర్ కేకెన్ గారు IPS, ఏఆర్ అడిషనల్ డిసిపి రియాజ్ ఫుల్ హక్ గారు,* కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, సిఐలు, ఆర్ఐ లు,ఎస్సైలు, ఆర్ ఎస్సైలు లు పాల్గొన్నారు.