ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన పార్టీకే మా మద్దతు
Updated on: 2023-10-28 21:42:00
సిద్దిపేట జిల్లా:నవంబర్ 18న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్షల మందితో మాదిగల విశ్వరూప మహా సభ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు.శనివారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో మాదిగల విశ్వరూప మహా సభలో మందకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుందన్నారు.ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగినప్పుడే వారి పిల్లల చదువులు బాగుపడతాయని. చదువుకున్నవారికి ఉద్యోగాలు వస్తాయన్నారు.అన్ని పార్టీలలో ఉన్నటువంటి దళితులందరు హైదరాబాదులో జరిగే మహాసభకు పార్టీలకు ఆతీతంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మాకు మద్దతు పలకాలన్నారు.ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తామని స్పష్టత ఇస్తే ఆ పార్టీకే తాము మద్దతు పలుకుతామని మందకృష్ణ మాదిగ వెల్లడించారు.