ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
నేడే కేసీఆర్ రాక
Updated on: 2023-10-16 09:46:00

బీఆర్ఎస్ అధి నేత, సీఎం కేసీఆర్ సోమవారం జనగామకు వస్తున్నారు. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జిల్లాకేం ద్రంలో జరిగే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన జనగామకు చేరుకుంటా రని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం సభ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటి బ హిరంగ సభ కావడంతో బీఆర్ఎస్ పార్టీ సవాల్‌గా తీసు కుందికేసీఆర్ సభ కోసం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఏ ర్పాట్లు చేసింది. జిల్లాకేంద్రంలోని సిద్ధిపేట రోడ్డుకు ఉన్న 18.23 ఎకరాల మెడికల్ కాలేజీ స్థలంలో సభను ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదికతో పాటు ముఖ్యులు కూర్చునేం దుకు జర్మన్ టెక్నాలజీతో కూడిన టెంటు వేశారు. ఇందులో సుమారు 10వేల మంది కూర్చునే అవకాశం ఉంది. 200మంది కూర్చునేలా భారీ వేదికను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రజల కోసం భారీ టెంట్లు వేశారు. సభకు లక్ష మంది వస్తారని బీఆర్ఎస్ భావిస్తోంది. వారి కోసం 2లక్షల మజ్జిగ, 2లక్షల వాటర్ ప్యాకెట్లను అందు బాటులో ఉంచారు. ఎండ తీవ్రత వల్ల ఎవరైనా సొమ్మసి ల్లి పడిపోతే ప్రథమ చికిత్స అందించేందుకు రెండు ఆంబులెన్సులను సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ రాక కోసం సభా ప్రాంగణానికి 200మీటర్ల దూరంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. అక్కడ దిగిన తర్వాత కేవలం 4 నిమిషా ల్లోపే సభా వేదికపైకి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. వివిధ మండలాల నుంచి వచ్చే ప్రజలు తమకు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను నిలిపి సభ ప్రాంగణానికి చేరుకుంటారు. కాగా.. జనగామ పట్టణానికి చెందిన వారంతా జనగామ చౌరస్తాకు చేరుకొని అక్కడి నుంచి డప్పు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల, కోలాట కళాకారు ల విన్యాసాల మధ్య సభా ప్రాంగణానికి చేరుకుంటారు.