ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
112 గ్రాముల బంగారు చోరీ కు గురైన వస్తువులు రికవరీ
Updated on: 2023-10-11 19:19:00
తాడేపల్లిగూడెం:రాజమండ్రి రైల్వే డిఎస్పి నాగేశ్వరరావు,భీమవరం రైల్వే సీఐ శంకర్రావు ఆదేశాలతో తాడేపల్లిగూడెం ఎస్సై శ్రీ హరి బాబు తన సిబ్బంది మరియు ఆర్పిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 112 గ్రాముల బంగారం రికవరీ అయినట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై హరిబాబు తెలియజేశారు.గత కొంతకాలంగా రైలుబళ్ళల్లో మహిళల మెడలో బంగారు వస్తువులు అప్రయించే ఒక ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారించగా 6 లక్షల 72 వేల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు రికవరీ అయినట్లు హరిబాబు తెలియజేశారు.పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన 25 సంవత్సరాల బాల తండ్రి జోసెఫ్ నిడదవోలు ప్రాంతంలో బసివిరెడ్డి పేటలో నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఒక ప్రకటనలో హరిబాబు తెలియజేశారు.చోరీ సొత్తు మొత్తము రికవరీ చేసి పద్దాయిని ఈరోజు విజయవాడ లోని ఏడవ ఏ.జె.ఎఫ్.సి.ఎం కోర్టు నందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగిందని హరిబాబు తెలిపారు.