ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
Updated on: 2026-02-09 09:51:00
గుణదల మేరీమాత ఉత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి, 11న ముగుస్తాయి. ఇప్పటికే ఆలయంతోపాటు కొండపై విద్యుత్తు దీపాలతో అలంకరించారు. సామరస్యానికి చిహ్నంగా నిలిచే ఉత్సవాలకు పది లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే వీలుంది.
ఉదయం 7 గంటలకు కొండ కింద బిషప్ గ్రాసీ పాఠశాల మైదానంలో విజయ వాడ కథోలిక పీఠం బిషప్ జోసఫ్ రాజారావు, వికార్ జనరల్ ఫాదర్ గాబ్రియేలు, మోన్సి న్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్ విలియం జయరాజు, ఇతర ఫాదర్లు, డయోసిస్ గురువులు లాంఛనంగా ప్రారంభిస్తారు.
కీలక ప్రాంతాల్లో సీసీ, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు మైనపు వత్తులు వెలిగిస్తారు. కొబ్బరికాయలు కొడతారు. తలనీలాలు ఇస్తారు. సంతానం లేని దంపతులు చెట్లకు ఉయ్యాళ్లు కడతారు. పిల్లలకు అన్నప్రా సనలు, రాత్రులు నిద్ర చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి.
బిషప్ గ్రాసీ పాఠశాలలో ప్రత్యేక వేదికపై సమష్టి దివ్య పూజబలి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సిటీ బస్టాండ్, పీఎన్బీఎస్, రైల్వే స్టేషన్ నుంచి ఏలూరు లాకుల మీదుగా గుణదల పడవల రేవు సెంట ర్ లోని బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకుంటాయి.
ముగిసిన నవదిన ప్రార్థనలు .. తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఉత్సవాల నవదిన ప్రార్ధనలు ఆదివారం రాత్రి ముగిశాయి. విజయ వాడ కథోలిక పీఠం మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు సందేశం ఇచ్చారు. గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్ యేలిటి విలియం జయరాజు తదితర గురువులు దివ్యసత్ప్రసాద ఆరాధనతో కొండపై పూజపీఠం వద్దకు చేరుకుని సమష్టి దివ్య పూజాబలి సమర్పించారు. ఫాదర్లు మరి యన్న, తోట సునీల్ రాజు, పుణ్యక్షేత్రం సహాయ గురువులు పాల్గొన్నారు.