ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
Updated on: 2025-12-15 06:20:00
బొబ్బిలి మండలంలో శివారు గిరిజన గ్రామాలయిన చిన్న మోసూరు వలస, చిలకమ్మ వలస, ఎరకందరవలస, సీయోను వలస, విజయపురి తదితర గిరిజన గ్రామాల్లో ఆదివారం బొబ్బిలి మాజీ సైనికుల సంక్షేమ సంఘము అధ్యక్షులు రేవళ్ల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు మరడ రామునాయుడు పర్యవేక్షణలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ మానవసేవ, సామాజిక బాధ్యతలో భాగంగా నిరుపేదలకు, అభాగ్యులకు అండగా నిలవడం.. చలికాలంలో వృద్ధులకు వెచ్చదనాన్ని అందించడం, వారి కష్టాలను తగ్గించడం మాజీ సైనికులు బాధ్యతగా తీసుకున్నారన్నారు. మండలంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో చలి తీవ్రత పెరిగిందన్నారు. గౌరవ అధ్యక్షులు రామినాయుడు మాట్లాడుతూ వృద్ధులు ఇబ్బందులు పడకుండా తమ వంతు బాధ్యతగా సంఘం సభ్యులు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు
అలాగే మహిళలకు పిల్లలకు వస్త్రములు, టువ్వాళ్ళు, పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా వంద మంది వృద్ధులకు దుప్పట్లు అందజేశారు.. బాలింత మహిళకు 500 రూపాయలు చీర పసుపు కుంకుమలు అందించారు కార్యక్రమంలో కార్యదర్శి ఏ గోవింద నాయుడు ఉప కార్యదర్శి ఎస్ ఆర్ మోహన్ రావు, వనమిత్ర కృష్ణ దాస్, సభ్యులు భోగి ఈశ్వరరావు సి హెచ్ మోహన్, సిహెచ్ త్రివేది, చంద్రమౌళి, పి నాగేశ్వరరావు, వియన్ శర్మ, పాండ్రంకి రవి, తదితరులు పాల్గొన్నారు.