ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మందికి గాయాలు.. ముగ్గురు పరిస్థితి విషమం
Updated on: 2025-11-18 09:16:00
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి ఇవాళ(మంగళవారం) గురైంది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది . స్థానికులు వెంటనే ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ బస్సు వేగంగా వెళ్తూ అనాసాగరం ఫ్లైఓవర్‌పై లారీని ఓవర్టేక్ చేయబోయి బలంగా ఢీ కొట్టిందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుందని.. ఇందులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం అనాసాగరం ఫ్లైఓవర్‌పై జరగడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిన బస్సును పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు.