ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
పేదల కష్టం తెలిసిన గొప్ప నేత సీఎం చంద్రబాబు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Updated on: 2025-11-17 20:22:00
21మంది బాధితులకు...11 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గుడివాడలో రూ.3.31 కోట్ల రికార్డు స్థాయి సీఎంఆర్ఎఫ్ నిధులను...బాధితులకు అందించాం గుడివాడ నవంబర్ 17:రాష్ట్రంలో పేదల కష్టం తెలిసిన గొప్ప నాయకుడు సీఎం చంద్రబాబు అని,బాధల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని 21 మంది బాధితులకు మంజూరైన 11 లక్షల చెక్కులను...టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో కూటమి నేతలతో కలిసి సోమవారం ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మరియు సీఎం చంద్రబాబుకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వివిధ కారణాలతో ఆరోగ్యశ్రీ లేనివారికి సీఎంఆర్ఎఫ్ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రజలకు ఎంతో సహాయంగా ఉండే సీఎం సహాయనిధి వ్యవస్థను ఐదేళ్లుగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్య సంరక్షణకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు.