ముఖ్య సమాచారం
-
మళ్లీ షాక్ ఇచ్చిన వెండి బంగారం... భారీగా పెరిగిన రేట్లు
-
:అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు
-
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
-
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. ఏప్రిల్లో కవిత కొత్త పార్టీ ప్రకటన!
-
మాజీ సైనికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలి
-
రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి ధర
-
:సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
-
పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
వాతావరణ మార్పులతో ప్రపంచానికి పెను ముప్పు.. 2050 నాటికి 76 శాతం పెరగనున్న కేసులు
Updated on: 2025-09-10 17:37:00
వాతావరణ మార్పుల కారణంగా 2050 నాటికి ఆసియా, అమెరికా ఖండాల్లోని అనేక దేశాల్లో డెంగీ కేసుల సంఖ్య ఏకంగా 76 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు వాషింగ్టన్, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయాలతో పాటు అమెరికా జాతీయ ఆర్థిక పరిశోధన బ్యూరోకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు.
వారి విశ్లేషణ ప్రకారం, ఇది కేవలం భవిష్యత్తు ముప్పు మాత్రమే కాదు. ఇప్పటికే 1995 నుంచి 2014 మధ్యకాలంలో నమోదైన డెంగీ కేసుల్లో 18 శాతం పెరుగుదలకు వాతావరణ మార్పులే కారణమని తేలింది. దీనివల్ల ఏటా సగటున 46 లక్షల మంది అదనంగా డెంగీ బారిన పడుతున్నారని అంచనా వేశారు.
డెంగీ వైరస్ను వ్యాపింపజేసే దోమలు వృద్ధి చెందడానికి, వ్యాధి వ్యాప్తికి సుమారు 27.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం చల్లగా ఉన్న ప్రాంతాలు వేడెక్కుతున్న కొద్దీ అక్కడ డెంగీ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. మెక్సికో, పెరూ, బ్రెజిల్ వంటి దేశాల్లోని అధిక జనాభా కలిగిన చల్లని ప్రాంతాల్లో కేసుల సంఖ్య భారీగా పెరగవచ్చని అంచనా వేశారు.