ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
క్విడ్ ప్రో కో
Updated on: 2025-09-10 07:00:00
హెచ్ఎండీఏ రూ.45 కోట్లు చెల్లించగానే.. బీఆర్ఎస్కు రూ.44 కోట్ల విరాళం
కేటీఆర్‌పై చార్జిషీట్‌కు అనుమతించండి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైలు పంపిన ఏసీబీ
అర్వింద్ కుమార్, మరికొందరిపై అభియోగాలు
నేడు సీఎస్ నుంచి గవర్నర్ వద్దకు ఫైలు, జోక్యానికి సుప్రీం నిరాకరణతో చకచకా పావులు
గవర్నర్ అనుమతి తర్వాత అరెస్టు లేదా చార్జిషీట్
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ నిందితుడిగా ఉన్న ఫార్ములా-ఈ కారు రేసులో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ తేల్చిందని సమాచారం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏ ఖాతా నుంచి రూ.45 కోట్ల మేర నిధులు ఫార్ములా ఈ కారు రేస్‌లో భాగస్వాములైన కంపెనీకి బదిలీ చేయడం.... ఆ కంపెనీల నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తిరిగి 44 కోట్ల రూపాయల నిధులు బీఆర్‌ఎ్‌సకు రావడం స్పష్టంగా కనిపిస్తోందని ఏసీబీ అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించిపలు ఆధారాలను ఏసీబీ సేకరించిందని తెలిసింది.
క్విడ్ ప్రో కో ఫలితంగానే ఫార్ములా రేసింగ్‌లో ఏ మాత్రం అనుభవం లేని ఏస్ నెక్ట్స్‌జెన్ భాగస్వామి అయ్యిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ వివరాలను తాజాగా ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పొందుపరిచారు. మంత్రివర్గం ఆమోదం లేకుండానే నాటి మంత్రి కేటీఆర్ ఈ నిధులను బదిలీ చేసేశారని, అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని అధికారులు అభిప్రాయానికి వచ్చారు. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఇతర నిందితులుగా ఏస్ నెక్ట్స్ జెన్ సీఈవో కిరణ్‌రావు, ఎఫ్ఈవో కంపెనీలను పేర్కొన్నట్లు తెలిసింది. ఈ మేరకు వారిపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఫైలును మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఈ కేసులో మరింత ముందుకెళ్లేందుకు, నిందితులపై చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. దీనిపై విజిలెన్స్ కమిషనర్ అభిప్రాయం కూడా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నట్లు తెలిసింది.
జీఏడీ అనుమతి కూడా తీసుకున్నాక గవర్నర్ వద్దకు బుధవారం ఈ ఫైలును పంపించనున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించినప్పుడు కూడా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోగా..ఇప్పుడు విచారణ ముగిసి నివేదిక సిద్ధమైన తరుణంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్ అనుమతిస్తే ఈ కేసులో నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు అవసరమైతే అరెస్టుల వరకూ కూడా వెళ్లే అవకాశాలున్నాయి
మరోవైపు ఈ కేసు విచారణపై స్టే ఇవ్వాలంటూ నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లినా....ఉన్నత న్యాయస్థానం దీనిలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ తరుణంలో విచారణ ప్రారంభమైన 9 నెలల అనంతరం ఈ కేసులో తదుపరి కీలక అడుగు పడింది. దర్యాప్తు పూర్తి అయినందున ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి కోరింది. ప్రాసిక్యూషన్ చర్యలకు గవర్నర్ అనుమతి లభిస్తే తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా అరెస్టు లేదా నేరుగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేయడానికి ఏసీబీ సన్నద్ధమైనట్లు సమాచారం.