ముఖ్య సమాచారం
-
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కొత్త నిబంధనలు
-
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 324 సీట్లు!
-
ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్ 7న 'బ్లడ్ మూన్'..
-
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. సెప్టెంబర్ 2వ తేదీన..!
-
కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ – మొత్తం మునక !
-
కామారెడ్డిలో ఎడతెరపిలేకుండా వర్షం
-
గూగుల్ మ్యాప్ ను నమ్మి... రాజస్థాన్లో విషాదం
-
భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు
-
సంక్షేమ గృహాల్లో ఉండే విద్యార్థుల ఇక్కట్లు తీర్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
-
సిగ్నల్ లేకున్నా వాట్సాప్ కాల్స్.. గూగుల్ పిక్సెల్ 10లో సరికొత్త టెక్నాలజీ!
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కొత్త నిబంధనలు
Updated on: 2025-08-29 09:45:00

విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భక్తుల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి . సెప్టెంబర్ 27 నుంచి భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఒకవేళ సంప్రదాయ దుస్తులు లేకపోతే ఆలయంలోకి ప్రవేశం ఇవ్వబోమని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
అదే విధంగా, ఆలయంలో సెల్ఫోన్ వాడకంపై నిషేధం విధించారు. ఇటీవల భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించకపోవడం, అంతరాలయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వంటి ఘటనలు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా, ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే వారు ఆలయ ఆఫీసులోనే ఫోన్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
భక్తులు, ఉద్యోగులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించడం ఇకపై తప్పనిసరి కానుంది. ఆలయ సిబ్బంది తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలని.. అలాగే స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ఇకపై డ్రెస్ కోడ్ లేకపోయినా, సెల్ఫోన్ తీసుకవచ్చే వారిని ఆలయంలోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.