ముఖ్య సమాచారం
-
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కొత్త నిబంధనలు
-
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 324 సీట్లు!
-
ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్ 7న 'బ్లడ్ మూన్'..
-
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. సెప్టెంబర్ 2వ తేదీన..!
-
కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ – మొత్తం మునక !
-
కామారెడ్డిలో ఎడతెరపిలేకుండా వర్షం
-
గూగుల్ మ్యాప్ ను నమ్మి... రాజస్థాన్‌లో విషాదం
-
భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు
-
సంక్షేమ గృహాల్లో ఉండే విద్యార్థుల ఇక్కట్లు తీర్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
-
సిగ్నల్ లేకున్నా వాట్సాప్ కాల్స్.. గూగుల్ పిక్సెల్ 10లో సరికొత్త టెక్నాలజీ!
భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు
Updated on: 2025-08-27 16:58:00

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ఇన్చార్జి మంత్రి డా. ధనసరి అనసూయ (సీతక్క)జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు సంబంధిత అన్ని విభాగాల అధికారులతో అత్యవసర టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాకపోకలను అనుమతించవద్దని, ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. రక్షణ చర్యల్లో ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోరాదని, ప్రతి ఒక్క అధికారి తమ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని సూచించారు
తెలంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం నెలకొంది. కామారెడ్డి జిల్లా బికనూరు తాళమండ్ల సెక్షన్లో భారీ వరద ప్రవాహంతో ట్రాక్ కింద నీరు నిలవడంతో వివిధ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మళ్లించింది. అక్కన్నపేట - మెదక్ సెక్షన్ పరిధిలోని పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మళ్లించింది. ముంబై టూ లింగంపల్లి, లింగంపల్లి టూ ముంబై, ఓఖా టూ రామేశ్వరం, భగత్ కి కోఠి టూ కాచిగూడ మధ్య రైల్వే సర్వీసులను డైవర్షన్ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్, కాజీపేట, సికింద్రాబాద్ జంక్షన్ మీదుగా మళ్లించారు. ఈరోజు వెళ్లాల్సిన నిజామాబాద్ టూ తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. కాచిగూడ టూ మెదక్ ట్రైన్‌ను రైల్వే అధికారులు పాక్షికంగా