ముఖ్య సమాచారం
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్‌కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
Updated on: 2025-12-09 14:42:00
టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. 600 బిలియన్ డాలర్ల నికర సంపదను సాధించిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం నాటికి ఆయన ఈ అరుదైన మైలురాయిని అధిగమించారు. ముఖ్యంగా ఆయనకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ 'స్పేస్ఎక్స్' త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుందన్న వార్తలే ఈ భారీ పెరుగుదలకు కారణంగా నిలిచాయి.
మస్క్ సంపద పెరగడానికి టెస్లా, ఎక్స్ఏఐ కంపెనీలు కూడా దోహదం చేస్తున్నాయి. టెస్లాలో ఆయనకు 12 శాతం వాటా ఉండగా, ఈ ఏడాది ఆ కంపెనీ షేర్లు 13 శాతం పెరిగాయి. డ్రైవర్ సీటులో సేఫ్టీ మానిటర్ లేకుండా రోబోట్యాక్సీలను పరీక్షిస్తున్నామని మస్క్ ప్రకటించడంతో సోమవారం టెస్లా స్టాక్ దాదాపు 4 శాతం లాభపడింది.
మరోవైపు మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ 'ఎక్స్ఏఐ' కూడా 230 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో 15 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు చర్చలు జరుపుతోంది. ఈ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు మస్క్, టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ఏఐ సంస్థలు వెంటనే స్పందించలేదని రాయిటర్స్ తెలిపింది.