ముఖ్య సమాచారం
-
ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్‌కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్‌లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్‌లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
Updated on: 2025-06-13 15:40:00

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం శుక్రవారం వెల్లడించింది.రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లక్డీకపూల్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్లు నీటితో నిండిపోయాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.